Tuesday, April 23, 2024

గీతా ఆర్ట్స్ తో కలర్ ఫోటో సినిమా దర్శకుడు

కలర్ ఫోటో సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు సందీప్ రాజ్. ఎటువంటి అంచనాలు లేకుండాఓటీటీ వేదికగా రిలీజైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో చాందినీ చౌదరి, సుహాస్ ప్రధాన పాత్రలలో నటించారు. అయితే కలర్ ఫోటో హిట్ తరువాత సందీప్ తో సినిమాలు చేయడానికి పలు నిర్మాణ సంస్థలు ముందుకొచ్చాయి. అయితే సందీప్ రాజ్ తన తర్వాత సినిమా కోసం గీత ఆర్ట్స్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడాట. కథ రెడి చేసుకున్న సందీప్ ఓ స్టార్ హీరోను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడట. గతంలో సందీప్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ తో పాటు, పలు సినిమాలకు రచన దర్శకత్వ విభాగంలో పనిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement