Tuesday, April 16, 2024

బిగ్ బాస్ సీజన్5 కి హోస్ట్ పై క్లారిటీ వచ్చేసింది!!

బిగ్ బాస్ సీజన్ 5 హోస్ట్ గా దగ్గుబాటి రానా రాబోతున్నాడని మొన్నటివరకు ప్రచారం జరిగింది. అయితే ఇదే విషయం తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు రానా. బిగ్ బాస్ సీజన్ 5 హోస్ట్ గా తాను వ్యవహరించట్లేదని క్లారిటీ గా చెప్పుకొచ్చారు. దీంతో రానా బిగ్ బాస్ హోస్ట్ గా రాబోతున్నారు అన్న వార్తలకు చెక్ పడింది.

ఇక మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా 2వ సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించారు. అలాగే మూడు నాలుగు సీజన్ లకు నాగార్జున వ్యవహరించారు. ఇక సినిమాల విషయానికొస్తే రానా ప్రస్తుతం నటించిన విరాటపర్వం త్వరలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా ప్రియమణి కీలక పాత్రలో నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement