Wednesday, April 24, 2024

‘విక్రమ్’ లో ఫహాద్ ఫాజిల్ పాత్ర పై క్లారిటీ ?

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కబోతున్న చిత్రం విక్రమ్. మాస్టర్ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ తీస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. కరోనా తగ్గాక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందించనున్నారు. మరోవైపు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తుండగా… మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాసిల్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫహాద్ ఈ సినిమాలో అవినీతిపరుడైన పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నాడట. అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా సినిమా మొత్తం విలన్ కు సహాయం చేసే పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇక గ్యాంగ్ స్టార్ గా విక్రమ్ పాత్రలో కమల్ కనిపించబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement