Friday, April 19, 2024

ఆచార్య లో ఆ ఇద్దరూ తండ్రి కొడుకులు కాదట !! కొరటాల క్లారిటీ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఇక రామ్ చరణ్ సిద్ధ పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో చిరంజీవి చరణ్ తండ్రీకొడుకులుగా కనిపించబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ విషయంపై కొరటాల శివ క్లారిటీ ఇచ్చాడు. ఇక రాష్ట్రంలోని దేవాలయాలు మరియు ఇతర మత పరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా చిరంజీవి ఈ సినిమాలో కనిపించబోతున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రాంచరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. అలాగే మరో హీరోయిన్ రెజీనా ఐటమ్ సాంగ్ లో కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement