Thursday, March 28, 2024

పుష్ప లో అతను నటించట్లేదట!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప.గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో ప్రముఖ టాలెంటెడ్ నటుడు అనీష్ కురువిల్లా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా ఆ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. కానీ సుకుమార్ దర్శకత్వంలో నటించాలని తనకు కూడా ఉందని అయితే ఈ సినిమాలో మాత్రం తాను నటించడం లేదని చెప్పుకొచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement