Friday, April 26, 2024

సినిమా బండి ట్రైలర్ సూపర్

ప్రవీణ్ కంద్రెగుల దర్శకత్వంలో బాలీవుడ్ దర్శకుడు ద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే నిర్మిస్తున్న చిత్రం సినిమా బండి. కాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ లో ఒక ఆటో డ్రైవర్ కు తన ఆటో లో ఒక ఖరీదైన కెమెరా దొరుకుతుంది.

ఆ కెమెరాతో ఆటో డ్రైవర్ పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి సినిమా తీయాలనుకుంటారు. నిజానికి వాళ్లకు అసలు సినిమా ఎలా తీయాలి అనే విషయం గురించి అవగాహన ఉండదు. కానీ ఆ అమాయకపు వ్యక్తులు కెమెరాతో తో చేసిన ప్రయోగాలు ఎలా ఉంటాయి అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇక కామెడీ పంచ్ డైలాగులు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని మే 14న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయబోతున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement