Sunday, June 4, 2023

మంత్రి మ‌ల్లారెడ్డి స‌మ‌క్షంలో సిఐ భార‌తి మూవీ షూటింగ్ షురూ…

నరేంద్ర, గరిమా జంటగా నటిస్తున్న చిత్రం ‘సిఐ భారతి’. రమణారెడ్డి గడ్డం దర్శకత్వంలో విశాల పసునూరి నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మల్లారెడ్డి స్క్రిప్ట్‌ అందజేశారు. నటు-డు అలీ తొలి సన్నివేశానికి క్లాప్‌ కొట్టారు. అనంతరం దర్శకుడు రమణా రెడ్డి గడ్డం మాట్లాడుతూ ”రొటీ-న్‌ కి భిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. సిఐ భారతి ఒక పవర్‌ ఫుల్‌ స్టోరి. ప్రస్తుతం ఆవులు పశుగ్రాసం లేక చెత్త కుప్పల దగ్గర పేపర్లు తినే పరిస్థితి చూస్తున్నాం. దీని గురించి మా చిత్రంలో ఒక ట్రాక్‌ పెట్టడం జరి గింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 10 నుంచి సింగిల్‌ షెడ్యూల్‌ లో షూ టింగ్‌ పూర్తి చేయనున్నాం” అన్నారు. సమర్పకులు ఘర్షణ శ్రీని వాస్‌ మాట్లాడుతూ ”రమణా రెడ్డి గారు అన్నీ తానై సినిమా చేస్తున్నారు. ఇంత మంచి చిత్రాన్ని నేను ప్రొడ్యూస్‌ చేయడం ఎంతో సంతోషంగా ” ఉందన్నారు. హీరో నరేంద్ర మాట్లా డుతూ ”ఐదు అద్భుతమైన పాటలున్నాయి. దర్శకుడు రమణా రెడ్డి గారు నా క్యారక్టర్‌ చాలా బాగా డిజైన్‌ చేశారు.” అన్నారు. హీరోయిన్‌ గరిమా మాట్లా డుతూ ”సిఐ భారతి చిత్రంలో హీరోయిన్‌ గా నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు” అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement