Friday, March 29, 2024

Chit chat with Major: బయోపిక్ ల‌కు భిన్నంగా ఉండే కథ.. నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయి..

అడివి శేష్‌ నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా సినిమా ‘మేజర్‌’. 26/11 హీరో మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా తీసిన చిత్రమిది. శశి కిరణ్‌ తిక్క దర్శకుడు. జూన్‌ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మహేష్‌ బాబు, ఏ ప్లస్‌ ఎస్‌ తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఇండియా నిర్మించింది. సినిమా విడుదల సందర్భంగా అడివి శేష్‌ మీడియా ముచ్చిటంచారు.

  • దేశమంతా పర్యటిసున్నట్టున్నారు?

మీరు మంచి సినిమా చేశారు అనడం సహజమే. కానీ అందరూ కంగ్రాట్స్‌ చెబుతూ మంచి సినిమా తీశామని అభినందిస్తున్నారు.

  • మేజర్‌ సందీప్‌ బయోపిక్‌ చేయాలని ఎప్పుడు అనిపించింది?

26/11 సంఘటనలు జరిగాక ఆయన గురించి చదివి ఆయనకు అభిమాని అయ్యాను. ఆయన నిజజీవితంలో జరిగిన విషయాలు ఎవరికీ తెలీవు. హోటల్‌లో 36 గంటలు ఏం చేశాడనేది తెలుసు. కానీ 31 సంవత్సరాలలో ఆయన జీవితం ఎలా వుందనేది ఎవరికీ తెలీదు. ఇవన్నీ నేను తెలుసుకున్నాక ఆయన లైఫ్‌ గురించి ఎందుకు చెప్పకూడదనే ఆలోచన వచ్చింది.

  • గొప్ప కథను సినిమాలో చూపించడం కష్టం అనిపించిందా?

సాధారణంగా బయోపిక్‌లు పొడిపొడిగా టచ్‌ చేస్తారు. కానీ ఇక్కడ సినిమాకు సరిపడే గొప్ప కథ వుంది. హీరోకు భజన కొట్టే కథకాదు. మామూలు బయోపిక్‌లకు భిన్నంగా వుండే కథ ఇది. ఆయన కొన్ని పనులు చేశారు అంటే ఇప్పుడు చాలామంది నమ్మకపోవచ్చు. చాలా నెగెటివ్‌లు వస్తుంటాయి. కానీ వాటిని నమ్మబుద్ధి వేయదు.

  • ఆయన జీవితంలో ముంబై దాడులే తెలుసు? ఆయన లైఫ్‌ గురించి చాలామందికి తెలీదు. అందుకే జనాలకు ఫ్రెష్‌ సినిమా అనిపిస్తుందా?

మేం సినిమా చేస్తున్నాం అని ప్రకటించాక చాలామంది 26/11 చూసేశాం కదా అన్నారు. కానీ ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యాక అందరూ షాక్‌ అయ్యారు. ఆయన జీవితంలో ఇంత వుందా? అని ఆశ్చర్యపోయారు.

- Advertisement -
  • బాలీవుడ్‌లో తీయలేని సందీప్‌ బయోపిక్‌ మీరు చేయడం ఎలా అనిపిస్తుంది?

బాలీవుడ్‌లో తీయలేదు అనికాదు కానీ. సందీప్‌ తల్లిదండ్రు లకు వారు నచ్చ లేదు. ఎందు కంటే బాలీవుడ్‌ వారు, మలయాళం వారు తీస్తామని ముందుకు వచ్చారు. కానీ హీరోలు తమ కొడుకులా లేరని సున్నితం గా ఆయన తల్లి తిరస్కరించారు. నన్ను చూడగానే చాలా హ్యాపీగా ఫీలయ్యారు. నేను ఆమెను అమ్మా అని పిలుస్తుంటాను.

  • సినిమా తీయడంలో మీకు ఎదురైనా ఛాలెంజ్‌లు ఏమిటి?

కోవిడ్ టైంలో ప్రతిసారీ ఈ సీన్‌ బాగా చేద్దాం అని ప్లాన్‌ వేసుకుని చేస్తుంటాం. కొద్దిరోజులు చేశాక కోవిడ్‌ రావడంతో చాలా లిమిటేషన్‌ను క్రియేట్‌ చేసింది.

  • ఇలాంటి కథకు హీరోయిన్‌కు ఎంతమేర ప్రాధాన్యత వుంది?

సాయి మంజ్రేకర్‌, శోభితా ధూళిపాళ ఇద్దరు హీరోయిన్లు వున్నారు. సందీప్‌ లైఫ్‌లో ఒకరు ప్రజెంట్‌, ఒకరు ఫాస్ట్‌లో వున్నారు. ఆయనంటే చాలామంది లేడీస్‌కు క్రష్‌ వుండేది.

  • మహేష్‌బాబు నుంచి ఎలాంటి సపోర్ట్‌ లభించింది?

డేరింగ్‌గా సినిమా తీశామంటే మహేష్‌బాబే కారణం. ప్రీరిలీజ్‌కుముందే ఆడియన్స్‌కు సినిమా చూపించి ప్రీ రిలీజ్‌ చేయడం అనేది గొప్ప విషయం.

  • షూట్‌ సమయంలో సైనికుల కష్టాలు, అక్కడి వాతావరణం చూశాక వ్యక్తిగా ఎలా అనిపించింది?

చివరి సన్నివేశం చిట్‌కూర్‌ అనే గ్రామంలో తీశాం. అక్కడ జనాలు 200మంది వుంటారు. పగలు మైనస్‌ 3 డిగ్రీలు వుంటుంది. రాత్రి మైనస్‌ 15వరకు వుంటుంది. ఇలాంటి ప్రాంతంలో హీటర్‌, బ్లాంకెట్స్‌ వుంచుకుంటాం. కానీ అవేవీలేకుండా సైనికులు గన్‌ పట్టుకుని వుండడం నాకు చాలా గొప్పగా అనిపించింది. ఇంతకుముందు కథలుగా చదివాను. కానీ వాస్తవంగా నేను చూశాను.

  • శశికిరణ్‌ తిక్కకు ఇది రెండో సినిమా. బయోపిక్‌ అనేది పెద్ద బాధ్యత కదా న్యాయం చేశారా?

నాకు వున్న భావాల్ని జనాలు ఫీల్‌ అయ్యేలా చేసేది దర్శకుడే. ఆయన చేయబట్టే ఇంటర్‌నేషనల్‌ లుక్‌ వచ్చింది. మంచి సినిమాకు అనుభవం కాదు. టాలెంట్‌ కావాలి. అది ఆయనలో చాలా వుంది.

  • సంగీతానికి ఎంత ప్రాధాన్యత వుంది?

శ్రీచరణ్‌ పాకాల మంచి సంగీతం ఇచ్చారు. నిన్నేకోరేనే.. హృదయమా పాటలు ట్రెండ్‌ అయ్యాయి. అందులో ఒకటి ఆర్మాన్‌ పాడిన విధానం నాకు ” బుట్టబొమ్మ” పాడిన ఫీలింగ్‌ వచ్చింది. శ్రీచరణ్‌ పాటలు ఇళయరాజాలా వుంటాయి.

  • ప్రకాష్‌రాజ్‌, రేవతి పాత్రలు ఎలా వున్నాయి?

ప్రకాష్‌రాజ్‌గారికి బెంగుళూరులో సందీప్‌ ఫాదర్‌ తెలుసు. మేం ఆయననుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. రేవతిగారు బాగా నటించారు.

  • క్షణం, గూఢచారి వంటి థ్రిల్లర్‌ కథలే చేస్తున్నారు. లవ్‌ సినిమాలు చేసే ఆలోచన వుందా?

అన్ని సినిమాల్లోనూ లవ్‌ స్టోరీ వుంటుంది. మేజర్‌లో కూడా వుంది. రేపు గూఛచారి2లోనూ వుంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement