Tuesday, March 26, 2024

చిరు చేతుల మీదుగా వైల్డ్ డాగ్ ట్రైలర్

అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మోన్ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం వైల్డ్ డాగ్‌. ఈ సినిమాలో కింగ్ నాగార్జున ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా కు సంబందించిన లుక్స్ అందరిని ఆకట్టుకున్నాయి. మరోవైపు గతంలో అంతా కొత్తవాళ్లతో ఈ సినిమా చేస్తున్నట్టు నాగార్జున ట్విట్టర్‌లో చెప్పటంతో ఈ సినిమా పై మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమా మేకింగ్ కూడా కొత్తగా ఉంటుందని అన్నారు.

నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఈ సినిమాను నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే కింగ్ నాగార్జున అభిమానులు ఆ సమయం ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement