Wednesday, October 27, 2021

నైట్ షూటింగ్ లో చిరు, చరణ్..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు కలిసి నటిస్తున్న చిత్రం “ఆచార్య”. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. సినిమాలోని రెండు పాటలు పెండింగ్‌లో ఉన్నాయి. చరణ్, చిరు కాంబోలో రావాల్సిన సాంగ్ ఒకటి కాగా, చరణ్, పూజాహెగ్డేపై ఒక సాంగ్. చరణ్ “ఆర్ఆర్ఆర్”తో బిజీగా ఉండడంతో అంతలోపు చిరంజీవి “గాడ్ ఫాదర్” షూటింగ్ ప్రారంభించారు. తాజాగా చరణ్ ఫ్రీ అవ్వడంతో “ఆచార్య”పై దృష్టి పెట్టారు.

హైదరాబాద్ శివార్లలోని ప్రత్యేక సెట్‌లో “ఆచార్య” షూటింగ్ నిన్న సాయంత్రం తిరిగి ప్రారంభమైంది. చిరంజీవి, చరణ్ లపై ఒక ప్రత్యేక సాంగ్ ఉండబోతోందట. ఈ పాట మెగా అభిమానులకు కనులవిందు అవుతుంది అంటున్నారు. పాటల చిత్రీకరణ ఒక వారం పాటు రాత్రి పూట కొనసాగుతుంది. రామ్ చరణ్, పూజా హెగ్డే వచ్చే వారం నుండి పెండింగ్‌లో ఉన్న ఇతర పాటను పూర్తి చేస్తారు. ఈ నెలాఖరులోగా “ఆచార్య” మొత్తం షూటింగ్ పార్ట్‌లు పూర్తవుతాయని, త్వరలో ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ చెప్పారు. ఈ సోషల్ మెసేజ్ డ్రామాలో కాజల్ అగర్వాల్ చిరంజీవితో రొమాన్స్ చేస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: త్రివిక్రమ్, నవీన్ పొలిశెట్టి మూవీ కన్ఫామ్..

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News