Thursday, March 28, 2024

జూన్ 18న ఆచార్య..?

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’. ‘ఆచార్య‌’  సినిమాను మే 13న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. అయితే ఇప్పుడు సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు ఈ రిలీజ్ డేట్ కూడా మారుతుంద‌ని అంటున్నారు. అందుకు కార‌ణం కోవిడ్ ప్ర‌భావ‌మే. సెకండ్ వేవ్‌లో క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతుండ‌టంతో సినిమా థియేట‌ర్స్‌ను మ‌రోసారి పూర్తిగా మూసి వేయాలా?  లేక యాబై శాతం ఆక్యుపెన్సీతో ర‌న్ చేయాలా? అని అంద‌రూ ఆలోచ‌న‌లో ఉన్నారు. దీంతో అంద‌రూ త‌మ సినిమాల రిలీజ్ డేట్స్‌ను వాయిదా వేసుకున్నార‌ని, అధికారికంగా చెప్ప‌లేదు కానీ.. ఇప్పుడు ఫిక్స్ చేసుకున్న రిలీజ్ డేట్స్ విష‌యంలో స్ప‌ష్ట‌త లేదు. ఈ నేప‌థ్యంలో ‘ఆచార్య‌’  ఇది వ‌ర‌కు ప్ర‌క‌టించిన‌ట్లు మే 13న విడుద‌ల కానుండ‌టం లేద‌ట‌.

అంతేకాదు ఆచార్య‌ షూటింగ్ పూర్త‌యిన‌ప్ప‌టికీ వి.ఎఫ్‌.ఎక్స్ స‌హా ఇత‌ర పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి కావ‌డానికి స‌మ‌యం ప‌ట్టేలా ఉంది. దీంతో ఇది వ‌రకే ఆచార్య‌  విడుద‌ల వాయిదా ప‌డుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ స‌మాచారం ప్రకారం ఆచార్య జూన్ 18న విడుద‌ల చేసే ఆలోచ‌న‌లో నిర్మాత‌లు ఉన్నార‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి దీనిపై ఆచార్య‌  చిత్ర నిర్మాతలు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement