Wednesday, March 27, 2024

వచ్చే వారం రీ-రిలీజ్ కానున్న చిరంజీవి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గ్యాంగ్ లీడర్’

తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల రీ-రిలీజ్ ట్రెండ్ లో ఒకప్పటి ఐకానిక్ మూవీ గ్యాంగ్ లీడర్ చేరింది. ఫిబ్రవరి 11న ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో రీ-రిలీజ్ కు సిద్దంగా ఉంది. కాగా, మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన ఈ సినిమాకు విజయ్ బాపినీడు దర్శకత్వం వహించారు. 1991 లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్యామిలీ సెంటిమెంట్, రొమాన్స్, అద్భుతమైన సాంగ్స్, బోలెడంత కిక్ ఇచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఇలా అన్నీ ఎమోషన్స్ తో అప్పట్లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

గత మూడు దశాబ్దాలుగా కమర్షియల్ సినిమాల ఫార్ములాకు ఒక దిక్సూచిగా నిలవడమే కాక యాక్షన్ హీరోగా చిరంజీవి స్టార్ ఇమేజ్ కు కల్ట్ ఫాలోయింగ్ ను కూడా ఈ సినిమా తెచ్చి పెట్టింది. శరత్ కుమార్, మురళీ మోహన్, ఆనందరాజ్, రావుగోపాల్ రావు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. వహించిన ఈ చిత్రానికి బప్పీ లాహిరి సంగీతం అందించారు.

చిరంజీవి నటించిన ఘరానా మొగుడు (1992), గత ఏడాది ఆగస్టు చివర్లో ఆయన పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో రీ రిలీజ్ అయింది. అయితే ఇది కేవలం కొందరు ఔత్సాహిక మెగా అభిమానులకు తప్ప మిగతా ప్రేక్షకుల దృష్టి లోనే పడలేదు. ఈ సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి ఊపు మీద ఉన్న మెగా అభిమానులు ఈ రీ రిలీజ్ ను సీరియస్ గా తీసుకుని ఖచ్చితంగా భారీ స్థాయిలో ఫ్యాన్ షోలు, సంబరాలు ప్లాన్ చేస్తారని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement