Saturday, April 20, 2024

కింగ్ మేకర్ ఫిక్స్ ?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత లూసిఫర్ వేదాళం రీమేక్ ల లో నటిస్తున్నాడు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చరణ్ నిర్మిస్తున్నారు. జూలై నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

తాజాగా ఈ సినిమా టైటిల్ పై ఓ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాకి కింగ్ మేకర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. సినిమాకి సరిగ్గా ఈ టైటిలబ్ సరిపోతుందని దర్శక నిర్మాతలు బావిస్తున్నారట. ప్రస్తుతం లూసిఫర్ రీమేక్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. దీనితో పాటు మరో మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు చిరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement