Friday, April 19, 2024

చిరంజీవి గాడ్‌ఫాద‌ర్ టీజర్ వచ్చేసింది – సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

చిరంజీవి హీరోగా న‌టిస్తున్న గాడ్‌ఫాద‌ర్ సినిమా టీజ‌ర్ ఇవ్వాల‌ (ఆదివారం) రిలీజ్ అయింది. చిరంజీవి శైలి మాస్ హంగులు, ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ తో టీజ‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. గాడ్ ఫాదర్ సినిమాతో ద‌స‌రాకు అభిమానుల‌ను అల‌రించేందుకు రెడీ అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో రూపొందుతున్న ఈ సినిమా టీజ‌ర్ ను ఆదివారం రిలీజ్ చేశారు. మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో కీల‌క‌మైన అతిథి పాత్ర‌లో బాలీవుడ్ అగ్ర‌హీరో స‌ల్మాన్‌ఖాన్ క‌నిపించ‌బోతున్నారు. చిరంజీవి పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకొని ఒక రోజు ముందుగానే సినిమా టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు.

ఇరవై ఏళ్లు ఎక్కడకు వెళ్లాడో ఎవ్వరికీ తెలియదు. సడన్ గా తిరుగొచ్చిన ఆరేళ్లలో జనంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడంటూ మురళీ శర్మ డైలాగ్ తో టీజర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. చిరంజీవిని ద్వేషిస్తూ కనిపించడం ఆకట్టుకుంటోంది. డు యూ నో హూ ఈజ్ హీ.. హీ ఈజ్ ది బాస్ ఆప్ ది బాసెస్ అంటూ చిరంజీవి క్యారెక్టర్ స్టైలిష్ గా టీజర్ లో ఎంట్రీ ఇచ్చింది. సల్మాన్ ఎంట్రీ స్టైలిష్ గా ఉంది. టీజర్ చివరలో ఇద్దరు కలిసి కనిపించి అభిమానులను అలరించారు. ఈ టీజ‌ర్‌లో చిరంజీవి క్యారెక్ట‌రైజేష‌న్‌, డైలాగ్ డెలివ‌రీ ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉన్నాయి. చిరు నుంచి అభిమానులు ఆశించే హంగుల‌తో సినిమాను తీర్చిదిద్దుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది.

సినిమా రిలీజ్ డేట్ ను రివీల్ చేశారు. దసరా కానుగా అక్టోబర్ 5న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో న‌య‌న‌తార, స‌త్య‌దేవ్ ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ముఖ్య‌మంత్రి కుటుంబానికి ఎదురైన ఆప‌ద‌ను ఓ గ్యాంగ్‌స్ట‌ర్ ఎలా ప‌రిష్కారించాడ‌నే పాయింట్‌తో గాడ్‌ఫాద‌ర్ రూపొందుతోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement