Saturday, April 20, 2024

బాలయ్య బర్త్ డే స్పెషల్….500 మంది పేదవారికి వ్యాక్సిన్

నేడు నందమూరి నటసింహం బాలకృష్ణ 61 వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా బాలయ్య బాబు కు సినీ రాజకీయ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకొని యిన్నమూరి గోపీచంద్ ఫ్రెండ్ సర్కిల్ ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్ ఆవరణలో 500 మంది నిరుపేదలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ను అందించారు.

ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరంకృష్ణారావు , శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, అలాగే ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని, మైత్రి మూవీస్ అధినేత ఎలమంచిలి రవిశంకర్ 14 రీల్స్ అధినేతలు రామ్ అచంట హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement