Thursday, April 25, 2024

చీకటి చిరు జ్వాలై లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ @ ఇష్క్

యస్ యస్ రాజు దర్శకత్వంలో తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ. మలయాళంలో మంచి విజయం సాధించిన ఇష్క్ మూవీకి అదే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి చీకటి చిరు జ్వాలై అనే లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, ఉమా నేహా ఆలపించగా మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.

ఏప్రిల్ 23న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. కాగా ఇప్పుడు జూలై 30న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement