Thursday, November 7, 2024

శంకర్ సినిమా తరువాత మరోస్టార్ డైరెక్టర్ తో చెర్రీ ?

మెగాస్టార్ వారసుడిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. మగధీర, రంగస్థలం వంటి చిత్రాలతో స్టార్ హీరోగా మారిపోయాడు. చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. చరణ్ ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ మరో స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ డైరెక్టర్ మరెవరో కాదు ప్రశాంత్ నీల్. కే జి ఎఫ్ సినిమా తో స్టార్ డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడట. అయితే అందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడా రాలేదు. మరి అందులో ఎంత వరకు నిజం ఉందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement