Saturday, April 20, 2024

చెర్రీ, లోకేష్ కనకరాజ్ ల మూవీ అప్డేట్ !!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.కాగా ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు రాజునిర్మించబోతున్నాడు.

అలాగే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజ్ లతో సినిమా చేయబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. కాగా లోకేష్ కనకరాజ్ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ కాంబినేషన్ లో సినిమా చెయ్యటానికి ప్రయత్నాలు చేస్తున్నారట. అవి ఫలిస్తే ఈ కాంబినేషన్ లో సినిమా రావడం ఖాయమని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement