Saturday, April 20, 2024

చత్రపతి రీమేక్ ప్లాన్ చేంజ్ !!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం ఛత్రపతి కర్ణన్ రీమేక్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చత్రపతి రీమేక్ సినిమా తో బాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నాడు సాయి శ్రీనివాస్. అయితే చత్రపతి హిందీ రీమేక్ షూటింగ్ ఏప్రిల్ 22న మొదలు పెట్టాలనుకున్నారు. అందు కోసం మూడు కోట్ల రూపాయలతో ఓ భారీ సెట్ ని ఆరు ఎకరాల్లో వేశారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ లు నిలిచిపోయాయి.

దీంతో షూటింగ్ అనుకున్న సమయానికి జరగలేదు. ఈ లోపు మూడు కోట్ల రూపాయల తో వేసిన సెట్ హైదరాబాద్ లో కురిసిన వర్షాలకు దెబ్బతిండి. దీంతో ఈ సెట్ ను మళ్ళీ రిమోడల్ పనిలో పడ్డారు ఆర్ట్ డైరెక్టర్. అయితే ఈ లోపు కర్ణన్ తెలుగు రీమేక్ ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి మొదటి షెడ్యూల్ను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement