Monday, October 7, 2024

హిందీలో ఛ‌త్ర‌ప‌తి.. టీజ‌ర్ రిలీజ్.. సిక్స్ ప్యాక్ లో హీరో

బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. హీరో ప్ర‌భాస్ కెరియ‌ర్ లో హిట్ అందించిన చిత్రాల్లో ఛ‌త్ర‌ప‌తి ఒక‌టి. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2005లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. మాస్ హీరోగా ప్రభాస్ క్రేజ్ ను మరింతగా పెంచిన సినిమా ఇది. అలాంటి ఈ సినిమాను అదే టైటిల్ తో హిందీలోకి రీమేక్ చేశారు.తెలుగులో మాస్ హీరోగా మంచి మార్కులు కొట్టేసిన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఈ సినిమా తెర‌కెక్కింది. సిక్స్ ప్యాక్ తో కనిపించడం కోసం గట్టి కసరత్తునే చేసి బెల్లంకొండ కెమెరా ముందుకు వెళ్లారు. పెన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు. మే 12వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. భారీ మాస్ యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement