Tuesday, October 8, 2024

శంకర్ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ ?

మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. ఇక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటికీ కూడా సినిమాపై రకరకాల వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఈ సినిమాపై మరో అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడట. ఇక పొలిటికల్ డ్రామా గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్ర మాటలు రాస్తున్నారు. అయితే రామ్ చరణ్ డ్యూయల్ రోల్ పై క్లారిటీ రావాలంటే మాత్రం చిత్రయూనిట్ అధికారికంగా స్పందించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement