Wednesday, November 30, 2022

క్యాబ్ సర్వీస్ ను స్టార్ట్ చేసిన కేథరిన్

సినీ నటి కేథరిన్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. తన అందం తో అభినయం తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అలాగే ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించింది. అయితే ఈ అమ్మడు తాజాగా మాదాపూర్ లో సందడి చేసింది. మాదాపూర్ లోని నోవాటెల్ లో లిమోసిస్ క్యాబ్ సర్వీసన్ ను ప్రారంభించింది.

- Advertisement -
   

మహిళల రక్షణ కోసం ఈ క్యాబ్ సర్వీస్ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మహిళలు ఎవరైనా ఈ క్యాబ్ బుక్ చేసుకుంటే మహిళా డ్రైవర్లే అందుబాటులో ఉంటారని నిర్వాహకులు తెలిపారు. నగరంలో 5 వేలకు పైగా క్యాబ్ సర్వీసులను అందుబాటులో ఉంచనున్నట్టు సంస్థ చైర్మన్ అసాద్ అహ్మద్ ఖాన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement