Friday, March 29, 2024

600 మిలియన్ల వ్యూస్….ఆదరగొడుతున్న బుట్టబొమ్మ

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అలా వైకుంఠపురములో. గత ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా అంతటి విజయం సాధించడంలో ప్రధాన పాత్ర పోషించింది మ్యూజిక్. ఎస్.ఎస్ తమన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది.

అందులో ముఖ్యంగా బుట్ట బొమ్మ సాంగ్ ఎంతగానో ఫేమస్ అయింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది. మొన్నటికిమొన్న 500 మిలియన్ ల మార్క్ అందుకున్న ఈ పాట… ఇప్పుడు 600 మిలియన్ల మార్కులు కూడా క్రాస్ చేసింది. దీంతో తెలుగు నుంచి ఓ సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఇక మరో వైపు లోకల్ నుంచి వార్నర్ వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ సాంగ్ కాంకూర్ చేసింది అని ఈ సాంగ్ ని కొన్న ఆదిత్య మ్యూజిక్ ట్వీట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement