Saturday, April 20, 2024

న‌టుడిగా బిజి.. ద‌ర్శ‌కుడు ఎస్ జె సూర్య‌కి భారీ రెమ్యున‌రేష‌న్

ఎస్ జే సూర్య త‌మిళ న‌టుడు..ద‌ర్శ‌కుడు..తెలుగువారికి కూడా ప‌రిచ‌య‌మే..ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో ఖుషీ చిత్రాన్ని తెర‌కెక్కించి సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. కాగా ఈ డైరెక్ట‌ర్ ఇప్పుడు నటుడిగా బిజీగా మారారు.కాగా ద‌ర్శ‌కుడు శంకర్ ఇండియ‌న్ 2 చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. హీరోగా విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తుండ‌గా.. కాజల్ అగర్వాల్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇండియన్‌ 2లో టాలెంటెడ్‌ యాక్టర్ ఎస్‌జే సూర్య మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నాడు.

ఎస్‌జే సూర్య ఇండియన్‌ 2కు సంబంధించిన షూటింగ్‌ కూడా ఇటీవలే పూర్తి చేశాడని ఇన్‌సైడ్‌ టాక్‌. .తాజా అప్‌డేట్‌ ప్రకారం ఇండియన్‌ 2లో విలన్‌ పాత్ర కోసం ఎస్‌జే సూర్య కెరీర్‌లోనే అత్యధికంగా రెమ్యునరేషన్‌ తీసుకున్నార‌ట‌. కాగా శంకర్‌ డైరెక్షన్‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచరణ్‌ హీరోగా వస్తున్న గేమ్‌ చేంజర్‌లో కీ రోల్ చేస్తున్నారు ఎస్ జే సూర్య‌. భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఇండియన్‌ 2 చిత్రంలో బాబీ సింహా, సిద్దార్థ్‌, స‌ముద్రఖని, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌ ఇత‌ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇండియన్‌ 2 చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉద‌య‌నిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి యంగ్ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు.ఇలా ప‌లు మూవీల‌తో బిజీగా మారాడు ద‌ర్శ‌కుడు ఎస్ జే సూర్య‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement