Saturday, April 20, 2024

లోకల్ కథను ప్రపంచ స్థాయిలో చెప్పటానికి సిద్ధం….ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సినిమా ఫిక్స్ !!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా గురువారం అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విషెస్ లు తెలిపిన సంగతి తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ తో సినిమాలు చేయబోతున్న దర్శకులు కూడా తమ ప్రాజెక్టుల గురించి తెలియచేస్తూ అభిమానులలో ఉత్సాహాన్ని నింపారు. ఇక ఈ నేపథ్యంలోనే ఉప్పెన సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు సాన కూడా ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకు సంబంధించి ఓ విషయాన్ని చెప్పుకొచ్చారు.

మొదట బుచ్చిబాబు ఎన్టీఆర్ ల సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కబోతోందని ప్రచారం జరిగింది. కాగా గురువారం ఎన్టీఆర్ కు బుచ్చిబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ…లోకల్ కథను ప్రపంచ స్థాయిలో చెప్పి ట్రెండ్ సృష్టిద్దాం… అందుకోసం ఎదురుచూస్తున్నాను సార్ అంటూ చెప్పుకొచ్చారు బుచ్చిబాబు. ఇక బుచ్చిబాబు చెప్పిన విషయం పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇక కొరటాల, ప్రశాంత్ నీల్ సినిమాల తర్వాత బుచ్చిబాబు తోనే ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement