Sunday, October 6, 2024

ప‌వ‌న్.. సాయిధ‌ర‌మ్ ల చిత్రం బ్రో.. మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్

ఎట్ట‌కేల‌కు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ల చిత్రానికి బ్రో టైటిల్ ని ఫిక్స్ చేసిన‌ట్లు మేక‌ర్స్ తెలిపారు.ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ మనిషి రూపంలో ఉన్న దేవుడిగా కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజైంది. ఈ సినిమాకు ‘బ్రో:ది అవతార్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేస్తూ మేకర్స్‌ పవన్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో పవన్‌ స్టయిలిష్‌ లుక్‌లో మంచి ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. అంతేకాకుండా చాలా కాలం తర్వాత పాత పవన్‌ కళ్యాణ్‌ను చూసినట్టు అనిపిస్తుంది. స్టైల్‌, యాటిట్యూడ్‌, స్వాగ్‌ ఇలా మూడు కలబోసినట్లుగా పవన్‌ కళ్యాణ్‌ పోస్టర్‌ ఉంది. ఈ పోస్టర్‌తో పవన్‌ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌లో నేపథ్య సంగీతం గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. బ్రో టైటిల్‌లో టైమ్‌ను కూడా ప్రజెంట్‌ చేస్తూ ఈ సినిమా థీమ్‌ను చెబుతున్నారు.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement