Wednesday, April 17, 2024

Breaking : స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ రాజ్ క‌న్నుమూత‌

స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ రాజ్ క‌న్నుమూశారు. గ‌త కొద్ది రోజులుగా ఆయ‌న అనారోగ్యంతో ఇబ్బంది ప‌డుతున్నారు. ఆయన అసలు పేరు తోటకూర సోమరాజు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన తాజాగా చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన అలనాటి సంగీత దర్శకుడు టీవీ రాజు కుమారుడు.90ల‌లో వచ్చిన సినిమాల్లో రాజ్.. కోటి కాంబో సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది. ప్రళయ గర్జన అనే సినిమాతో రాజ్.. కోటి ప్రయాణం మొదలైంది.తొలి సినిమాతోనే వీరిద్ద‌రు సంగీత దర్శకులుగా పేరు గాంచారు. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన యముడికి మొగుడు సినిమాకి మ్యూజిక్ అందించడంతో రాజ్ ..కోటి దశ తిరిగింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా అంటే పక్కాగా మ్యూజికల్ హిట్ అనే టాక్ ఉండేది. దీంతో దర్శక నిర్మాతలు రాజ్ కోటి సంగీతం కోసం క్యూలు కట్టేవారు. అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు వారి భేదాభిప్రాయాలు తలెత్తాయి. తర్వాత వీరిద్దరూ విడిపోయి ఎవరికి వారు విడివిడిగా సినిమాలు చేయడం ప్రారంభించారు. ఇక రాజ్ కోటి విడిపోయిన తర్వాత రాజ్ ఎక్కువగా సినిమాలు చేయలేదు. ఆయన చేసిన సినిమాల్లో ‘సిసింద్రీ’ చెప్పుకోద‌గిన‌దిగా మిగిలింది. చివరిగా ఆయన లగ్నపత్రిక సినిమాతో ప్రేక్షులను పలకరించారు. కాగా ప‌లువురు సెల‌బ్రిటీలు ఆయ‌న మృతికి సంతాపం తెలియ‌జేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement