Tuesday, April 23, 2024

రచ్చ రవి కొంప ముంచిన బ్రహ్మాజీ !!

సీనియర్ సినీ నటుడు బ్రహ్మాజీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా… బ్రహ్మాజీ ఎన్నో పాత్రలు చేశారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్రహ్మాజీ… అప్పుడప్పుడు సినీ సెలబ్రిటీల పై పంచ్ డైలాగులు కూడా వేస్తూ ఉంటారు. తాజాగా జబర్దస్త్ రచ్చ రవి పై సెటైర్ వేశారు బ్రహ్మాజీ.

ఓ ఈవెంట్ కి సంబంధించి ఫోటోను పోస్ట్ చేస్తూ మిమ్మల్ని ఎప్పుడూ కలుసుకుంటానో మళ్ళీ అంటూ ప్రేక్షకుల ను ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. ఆ ఫోటో లో రచ్చ రవి పక్కన యాంకర్ గీత భగత్ నిలుచుని ఉన్నారు. అయితే రవి చేసిన పోస్ట్ పై బ్రహ్మాజీ తనదైన శైలిలో ఓ సెటైర్ వేశారు. ఎవరిని… మీ పక్కన వాళ్ళ గురించా అంటూ యాంకర్ తో లింక్ ని కలుపుతూ సెటైర్ వేశారు. ప్రస్తుతం బ్రహ్మాజీ వేసిన ఈ సెటైర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement