Saturday, April 20, 2024

చ‌ర‌ణ్ పై బాలీవుడ్ క‌న్ను.. ఆఫ‌ర్ ఇచ్చిన బ‌డా ప్రొడ‌క్ష‌న్ హౌస్..

S.S.రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవల విడుదలైన‌ ‘RRR’ అద్భుతమైన విజయం టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్‌కు మంచి పేరును అందించింది. సినిమాలో అల్లూరి సీతారామరాజుగా తన అద్భుతమైన నటనతో అల‌రించిన చరణ్, బాలీవుడ్‌లోని దర్శకనిర్మాతలకు బుల్స్ ఐగా మారాడు. రామ్ చరణ్ బాలీవుడ్ సినిమా గురించిన గాసిప్ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో హల్ చల్ చేస్తోంది. ప్రముఖ హిందీ ప్రొడక్షన్ హౌస్ చేయ‌బోయే సినిమా కోసం రామ్ చరణ్‌ను ఎంపిక చేయడానికి ఆసక్తికరమైన ఆఫర్‌తో ముందుకు వచ్చినట్లు సమాచారం.

రామ్ చరణ్ తన ప్రస్తుత కమిట్‌మెంట్‌ల తర్వాత త్వరలో బాలీవుడ్ చిత్రంలో ఖచ్చితంగా కనిపించ‌నున్న‌ట్ట తెలుస్తోంది. మరోవైపు, రామ్ చరణ్, శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో రాబోయే బిగ్ బ‌డ్జెట్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు, ఇందులో కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్ లో క‌నిపించ‌నుంది. అలాగే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement