Tuesday, April 23, 2024

ఆదిపురుష్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా కనిపించనున్నాడు. అలాగే కృతిసనన్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇక రావణాసురుడిగా సైఫ్అలీఖాన్ కనిపించబోతున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా…కరోనా కారణంగా వాయిదా పడింది.

ఇప్పటికే కౌసల్య పాత్రలో హేమమాలిని దశరథుడు పాత్రలో కృష్ణంరాజు, లక్ష్మణుడి పాత్ర లో టైగర్ షాప్ లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా బాలీవుడ్ సంగీత దర్శకులు సాచేత్ టాండన్-పరంపర ఠాకూర్ లను తీసుకున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement