Thursday, April 25, 2024

చరణ్ మీసంపై బాలీవుడ్ ఫిలిమ్ ఎనలిస్ట్ ప్రశంసలు

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. చిరుత సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి చరణ్ మగధీర సినిమాతో ఇండస్ట్రీ రికార్డు బ్రేక్ చేశారు. అయితే అప్పటి నుంచి కూడా విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు చరణ్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అయితే ఈ సినిమాలో మీసకట్టు తో కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్నాడు రామ్ చరణ్. కాగా రామ్ చరణ్ గెటప్ పై పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే ప్రశంసలు కురిపించగా తాజాగా బాలీవుడ్ ఫిలిమ్ అనలిస్ట్ రాహుల్ వర్మ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు. చరణ్ లుక్ స్టన్నింగ్ గా ఉందని… మీస కట్టు,కళ్ళల్లో పౌరుషం చూస్తుంటే మగధీర ను మించిపోయేలా ఉందని అనిపిస్తోందని కామెంట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement