Friday, March 29, 2024

Body shaming : నా బ‌రువు ఇత‌రుల స‌మ‌స్య కాదే.. భాగ్య

ఈ మ‌ధ్య‌కాలంలో ప‌లువురిపై బాడీ షేమింగ్ కి పాల్ప‌డుతున్నారు ప‌లువురు నెటిజ‌న్స్ . సెల‌బ్రిటీల ద‌గ్గ‌ర నుండి సామాన్యుల వ‌ర‌కు ఈ బాడీ షేమింగ్ కి గుర‌వుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా రీసెంట్ గా ప్రముఖ మలయాళీ నటుడు సురేశ్ గోపి కూతురు భాగ్య బాడీ షేమింగ్ కు గురయ్యారు. తనను కామెంట్ చేసిన వ్యక్తికి భాగ్య కూడా సీరియస్ గా రిప్లై ఇచ్చింది. కెనడాలోని ఒక కాలేజీ నుంచి భాగ్య గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ పిక్స్ పై ఒక నెటిజెన్ స్పందిస్తూ… ఇకపై మీరు చీరలను పక్కన పెట్టి వెస్టర్న్ దుస్తులు వేసుకుంటే బాగుంటుందని కామెంట్ చేశాడు. లావుగా ఉన్నవాళ్లకు చీరలు పెద్దగా సెట్ కావని, వెస్టర్న్ దుస్తుల్లో మీరు అందంగా ఉంటారని సూచించాడు. ఈ వ్యాఖ్యలపై భాగ్య స్పందిస్తూ… మీ ఉచిత సలహాలకు ధన్యవాదాలు అని రిప్లై ఇచ్చింది. తన బరువు ఇతరుల సమస్య కాదని… కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. ఇతర భారతీయ విద్యార్థుల మాదిరి పాశ్చాత్య సంస్కృతికి బలవంతంగా తలవంచే వ్యక్తిని తాను కాదని చెప్పింది. ఇతరుల శరీరాకృతి గురించి వ్యాఖ్యలు చేయకుండా… మీ పనిపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement