Tuesday, March 19, 2024

నా తమ్ముడు హిట్ కొడతాడు – రత్న ప్రభ

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో లాంగ్ గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. అయితే ఈ సినిమా రిలీజ్ పై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పవన్ కు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు.

కాగా తిరుపతి ఉప ఎన్నిక బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నా సోదరుడు పవన్ కళ్యాణ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం నాకుంది… అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం థియేటర్స్ లో వకీల్ సాబ్ దుమ్ము దులుపుతుంది. పవన్ తన డైలాగ్స్ తో నటనతో అభిమానులతో కేకలు పెట్టిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement