Thursday, April 18, 2024

మెహరీన్ తో నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వటంపై బిష్ణోయ్ రియాక్షన్!!

హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్ తో మెహరీన్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఇద్దరు కూడా తమ నిశ్చితార్థాన్ని క్యాన్సల్ చేసుకున్నారు. ఇదే విషయమై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. కాగా ఇదే విషయమై బిష్ణోయ్ స్పందించారు. మా జోడి మంచి జోడి అవుతుందని అనుకున్నామని కానీ కాలం జీవితాలను వేరు చేసిందని చెప్పుకొచ్చాడు. మెహరీన్ నుంచి విడిపోతున్నందుకు అసలు బాధ పడటం లేదని మెహరిన్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని తన కలల అన్నింటిని తొందరగా సాకారం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

అలాగే తన గురించి తన కుటుంబం గురించి విమర్శిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టిన వారిపై… చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బిష్ణోయ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement