Tuesday, April 16, 2024

బిగ్ బాస్ సీజన్5….పాయల్ క్లారిటీ

ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అయితే ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో అవకాశాలు రాలేదు. అరకొర అవకాశాలు వచ్చినా మెయిన్ హీరోయిన్ గా మాత్రం రాలేదు.

ఇకపోతే ఇటీవల పాయల్ బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 5 లో కంటెస్టెంట్ గా ఉండబోతుంది అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. కాగా ఇదే విషయంపై స్పందించారు పాయల్. నేను తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో లేనని అదంతా ఫేక్ న్యూస్ మాత్రమేనని దయచేసి ఇలాంటి రూమర్స్ లోకి నన్ను లాగవద్దు అని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం పాయల్ తమిళ్ హర్రర్ థ్రిల్లర్ సినిమాతో పాటు మరి కొన్ని చిత్రాల్లో నటిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement