Friday, April 19, 2024

బిగ్ బాస్ సీజన్ 5 అనుకున్న సమయం కంటే ఆలస్యం !!

బిగ్ బాస్ షో కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ లభించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని భాషలతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది బిగ్ బాస్. ఇప్పటికే నాలుగు సీజన్ లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 5 వ సీజన్ కి సిద్ధమవుతోంది. కాగా ఈ సీజన్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఈ షోకు కింగ్ నాగార్జుననే మళ్లీ హోస్ట్ గా వ్యవహరించనున్నారు అని తెలుస్తోంది.

దీంతో పాటు మరో వార్త కూడా బయటకు వచ్చింది. ఇది అనుకున్న సమయానికి రావట్లేదట. నిజానికి జూలై నాటికి ప్లాన్ చేసిన ఈ సీజన్ కొన్ని కారణాల వల్ల సెప్టెంబర్ కి అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ డేట్స్ ని కూడా మార్చారట. అన్ని పరిస్థితులు చక్కబడ్డాక ఈ సీజన్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట నిర్వాహకులు. ఇక మరి ఈసారి ఎలాంటి సెలబ్రిటీస్ ని కంటెస్టెంట్ గా తీసుకో వస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement