Thursday, April 25, 2024

మేఘనాధుడు పాత్రలో బిగ్ బాస్ కంటెస్టెంట్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం ఆది పురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా కనిపించనున్నాడు. అలాగే కృతిసనన్ సీతగా కనిపించనుంది. అలాగే రావణాసుర పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాలో మరో నటుడు చేరాడు. బిగ్ బాస్ సీజన్ 13 కంటిస్టెంట్ సిద్ధార్థ ను మేఘనాదుడు పాత్ర కోసం తీసుకున్నారు.

అన్ని అనుకున్నట్లు జరిగితే ఇప్పటికే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉంది. అందులో సిద్దార్థ్ కూడా జాయిన్ అవ్వాలి. కానీ కరోనా కారణంగా నిలిచిపోయింది. ఆదిపురష్ సినిమా షూటింగ్ ఇంకా 90 రోజులు బ్యాలెన్స్ ఉంది. సెకండ్ వేవ్ తగ్గిన తరువాత ఎప్పుడు షూటింగ్ మొదలైన మొదటి ప్రాధాన్యం ఆదిపురుష్ కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడట ప్రభాస్.

Advertisement

తాజా వార్తలు

Advertisement