Tuesday, March 26, 2024

Big boss5: ప్రియాంక సింగ్‌ కు మద్దతు ప్రకటించిన నాగబాబు

 మెగా బ్రదర్ నాగబాబు బుల్లి తెర మెగా షో బిగ్‌బాస్‌పై స్పందించారు. బిగ్‌బాస్‌-5లో యాంకర్‌ రవి, యానీ మాస్టర్‌, సింగర్‌ శ్రీరామ్‌, ప్రియ, నటరాజ్‌ మాస్టర్‌తో పాటు చాలా మంది పాల్గొన్నారని, వీరంతా తనకు ఒకెత్తు అయితే.. ట్రాన్స్‌ జెండర్‌ ప్రియాంక సింగ్‌ మరో ఎత్తు అన్నారు. తన పూర్తి మద్దతు ప్రియాంకకే ఉంటుందన్నారు.

ప్రియాంక అబ్బాయిగా (సాయి) ఉన్నప్పుడే తనకు బాగా క్లోజ్‌ అని, ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారన్నారు. ప్రియాంక బిగ్‌బాస్‌లోకి వెళ్లిందనే విషయం చాలా సంతోషానిచ్చిందన్నారు.

 ట్రాన్స్‌ జెండర్‌గా మారాక ప్రియాంక చాలా ఇబ్బంది పడిందని, అవకాశాలు రాని సమయంలో తాను ఓ షోలోకి తీసుకొని సాయం చేశానని గుర్తు చేశారు. ప్రియాంక విన్నర్‌ అవుతుందా లేదా తనకు తెలియదని కానీ, తన పూర్తి మద్దతు ప్రియాంకకే ఇస్తానని తేల్చి చెప్పారు.

ఇక ప్రియాంక విషయానికొస్తే.. ఓ కామెడీ షోలో లేడీ గెటప్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రియాంక అసలు పేరు సాయి తేజ. ట్రాన్స్‌ జెండర్‌గా మారాక ప్రియాంక సింగ్‌ అని పేరు మార్చుకున్నారు. 

ఇది కూడా చదవండి: అతి త్వరలోనే టీమిండియా ఇంగ్లండ్ టూర్..

Advertisement

తాజా వార్తలు

Advertisement