Friday, April 19, 2024

డివైడర్‌ను ఢీ కొట్టిన కారు.. ‘బిగ్‌బాస్’ ఫేమ్ యాషికాకు తీవ్రగాయాలు, ఒకరు మృతి

బిగ్‌బాస్ ఫేమ్ నటి యాషిక ఆనంద్ కు కారు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైయారు. తమిళనాడులో ని చెంగల్పట్టు జిల్లా మామల్లపురంలో డివైడర్‌ను కారు ఢీ కొట్టడంతో యాషికా ఆనంద్ సహా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో నటి యాషికతో ప్రయాణిస్తున్న ఇద్దరు స్నేహితులకు కూడా తీవ్ర గాయాలపాలైయారు. దీంతో వారిని మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఘటనా స్థలంలో తీవ్ర గాయాలతో మృతి చెందిన మరో మహిళ హైదరాబాద్‌కు చెందిన వల్లిచెట్టి భవానీ (28)గా గుర్తించారు. మమల్లాపురం పోలీసులు వల్లిచెట్టి భవానీ (28) మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మద్యం మత్తులో వేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం యాషిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో ఉండి డ్రైవ్ చేశారా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.

నటి యాషికా ఆనంద్ విషయానికి వస్తే .. ఫ్యాషన్ మోడల్ , టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ పంజాబీ ఫ్యామిలీ నటి … 2016 లో దురువంగల్ పత్తినారుతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత 2018 లో అడల్ట్ కామెడీ , ఇరుట్టు అరైయిల్ మురట్టు సినిమాలతో క్రేజీ స్టార్ గా మారింది . బిగ్ బాస్ 2 తమిళ్ సిరీస్లో కూడా ఎంట్రీ ఇచ్చి తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

ఇది కూడా చదవండి : ఏలూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. పోస్టల్ బ్యాలెట్లలో వైసీపీ ఆధిక్యం

Advertisement

తాజా వార్తలు

Advertisement