Thursday, April 25, 2024

బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ వీరేనా..?

బుల్లితెర మెగా రియాలిటీ షో బిగ్ బాస్ 5 సీజన్ కోసం నిర్వహకులు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 4 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఐదవ సీజన్ కోసం సన్నద్దమవుతోంది. దీనికోసం కంటెస్టెంట్స్ ని కూడా ఫీక్స్ చేసినట్లు తెలుస్తోంది. . నిజానికి బిగ్ బాస్ ఐదో సీజన్ ను జూన్‌ నెలలోనే నిర్వహించాలని బిగ్ బాస్ షో నిర్వాహకులు భావించినప్పటికీ కరోనా పరిస్థితుల కారణంగా వీలు కాలేదు. అయితే త్వరలో బిగ్ బాస్ సీజన్ 5 రాబోతుంది. దీనితో ఈ షో ను ఆగస్ట్ చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో కచ్చితంగా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి కూడా బిగ్ బాస్ హౌస్, కొత్త కొత్త టాస్క్ లతో బిగ్ బాస్5 ఈసారి మరింత రసవత్తరంగా ఉండబోతుందని అన్నట్టు సమాచారం. అయితే ఈ షో లో హోస్ట్ ఎవరనే విషయం పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.కానీ కంటెస్టెంట్ లు మాత్రం ఫిక్స్ అయినట్టు సమాచారం. అయితే ఈ సారి బిగ్ బాస్ సీజన్ 5 లోకి అడుగు పెట్టబోతున్న కంటెస్టెంట్ లు వీరే.

  1. యాంకర్ రవి
  2. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియా
  3. గెటప్ శ్రీను
  4. యాంకర్ వర్షిణి
  5. రఘు మాస్టర్
  6. సురేఖ వాణి
  7. సీరియల్ యాక్ట్రెస్ నవ్య స్వామి
  8. షణ్ముఖ్ జస్వంత్
  9. ప్రేమకావాలి హీరోయిన్ ఈషా చావ్లా
  10. యూట్యూబర్ సిరి
  11. లోబో
  12. సింగర్ మంగ్లీ
  13. టిక్ టాక్ స్టార్ దుర్గా రావు
  14. 14.టీవీ 9 ప్రత్యూష
  15. సీరియల్ ఆర్టిస్ట్ లు సిద్ధార్థ్ వర్మ అండ్ భార్య విష్ణు ప్రియ.

ఇది కూడా చదవండి: ఆ అలవాటుకి బానిసనయ్యాను: అనుపమ..

Advertisement

తాజా వార్తలు

Advertisement