Saturday, October 12, 2024

Bholaashankar : సంగీత్ సాంగ్.. కొరియోగ్రాఫ‌ర్ గా శేఖ‌ర్ మాస్ట‌ర్

త‌మిళ చిత్రం వేదాళంకి రీమేక్ గా తెర‌కెక్కుతోంది భోళా శంక‌ర్.ఈ చిత్రాన్ని మెహ‌ర్ ర‌మేశ్ రూపొందిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మిల్కీ బ్యూటీ తమన్నా ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. కీర్తిసురేశ్‌ చిరంజీవి సోదరి పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్‌లో తమన్నా, చిరు, కీర్తిసురేశ్ కాంబోలో వచ్చే ఎనర్జిటిక్‌ సాంగ్‌ను షూట్‌ చేస్తున్నారని.. శేఖర్‌ వీజే ఈ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేస్తున్నాడని ఇప్పటికే ఓ అప్‌డేట్ బయటకు వచ్చింది. తాజాగా ఈ సాంగ్‌ అఫీషియల్‌ న్యూస్‌ను షేర్ చేశాడు చిరంజీవి. తాజా పాట సంగీత్‌ సెర్మనీ నేపథ్యంలో ఉండబోతుంది. ఈ పాటలో చిరు, తమన్నా, కీర్తిసురేశ్, సుశాంత్‌తోపాటు రఘుబాబు, ఇతర నటీనటులంతా చిందులేయబోతున్నారు. కలర్‌ఫుల్‌ సెట్‌లో పాట ఎంత కలర్‌ఫుల్‌గా ఉండబోతుందో చిరు షేర్ చేసిన వీడియో చూస్తే అర్థమవుతుంది. భోళా శంకర్ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు. మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. భోళా శంకర్ లో మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్‌, వెన్నెల కిశోర్‌, పీ రవి శంకర్‌, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్‌, ఉత్తేజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement