Saturday, April 20, 2024

Bholaashankar : భోళా మానియాలో.. చిరంజీవి మ్యాన‌రిజం

వేదాళ‌మ్ చిత్రానికి రీమేక్ గా తెర‌కెక్కుతోంది భోళా శంక‌ర్ చిత్రం.ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేశ్ తెర‌కెక్కిస్తున్నాడు.. మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా త‌మ‌న్నా న‌టిస్తుండ‌గా.. సోదరిగా కీర్తిసురేశ్‌ నటిస్తోంది. భోళాశంకర్‌ జూన్‌ చివరి నాటికి షూటింగ్ పూర్తి కానుంది. అనంతరం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు షురూ చేయనున్నారు. భోళా మేనియా లిరికల్ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేశారు మేకర్స్‌. ఈ సాంగ్ మెగాస్టార్ చిరంజీవి మ్యానరిజంలో కంపోజ్‌ చేసిన స్టెప్పులతో ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను మహతి స్వరసాగర్‌, ఎల్‌వీ రేవంత్‌ పాడారు.భోళా శంకర్‌ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్‌, వెన్నెల కిశోర్‌, పీ రవి శంకర్‌, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్‌, ఉత్తేజ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు‌.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement