Wednesday, March 27, 2024

భీమ్లా నాయ‌క్ అన్‌సీన్ పోస్ట‌ర్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా ఫోటో

ప‌వ‌ణ్ క‌ళ్యాణ్‌ పవర్‌స్టోర్మ్ భీమ్లా నాయక్ తెరపైకి వచ్చి సరిగ్గా ఒక సంవత్సరం అవుతుంది. మలయాళం సినిమా “అయ్యప్పనుమ్ కోషియుమ్”కు అఫీషియ‌ల్ రీమేక్ గా తెరకెక్కింది. ఇక‌ ఈ సినిమాలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మెంటల్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ రానా ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద కూడా అధిరిపోయే వ‌సూల్ల‌ను రాబ‌ట్టి స‌క్సెస్ ఫుల్ ప్రాజెక్ట్ గా నిలిచింది భీమ్లా నాయక్.

కాగా, ఈ మెగా బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ రిలీజ్ అయ్యి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా, “Celebrating 1 Year of POWER STORM ~ #BheemlaNayak, #1YearForBheemlaNayak” అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు మేకర్స్ . అంతే కాకుండా దీంతో పాటు సినిమాలో ప‌వ‌ణ్ కళ్యాణ్ కు సంబంధించి అన్‌సీన్ పోస్టర్ ఒక‌టి రిలీజ్ చేశారు. ఈ అన్‌సీన్ పోస్ట‌ర్ లో పవన్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు.. ఇక ఇప్ప‌టికే ఈ ఫోటో ఇంటర్నెట్‌లో వైర‌ల్ గా మారింది చేసుకుంది.

ఈ సినిమాకి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించ‌గా, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించారు. నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ కథానాయికలుగా నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై నాగవంశీ నిర్మించిన ఈ మూవీకి తమన్ మ్మూజిక్ అందించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement