Saturday, April 20, 2024

భీమ్లా నాయక్ ఆల్ టైం హై!!

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అలాగే రానా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. నిత్యమీనన్, అలాగే ఐశ్వర్య రాజేష్ ను హీరోయిన్స్ గా ఈ సినిమాలో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే పవన్ కెరీర్ లో ఏ సినిమాకి కూడా రాని హైప్ ఈ సినిమాకు వచ్చింది. ఇదే విషయాన్ని చెబుతూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ భీమ్లా నాయక్ ఆల్ టైం హై అంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement