Thursday, April 25, 2024

మెకప్​ రూంలో రచ్చ చేస్తున్న బిచ్చగాడు 2.. హైప్​ క్రియేట్​ చేస్తున్న వీడియో..

కంటెంట్ క‌లిగి.. ఎంట‌ర్టైన్ మెంట్ చిత్రాలతో వినోదం అందిస్తున్నాడు నటుడు విజయ్ ఆంటోని.. తిరుగులేని ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించాడు. ముఖ్యంగా, ఇటీవలే తన 6వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న అతని సినిమా ‘పిచైక్కారన్’ తమిళంలోనే కాదు, తెలుగు వెర్షన్ – బిచ్చగాడులో కూడా 144 రోజుల బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాగా, ఇప్పుడు బిచ్చ‌గాడు2 మూవీ కూడా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమాకి సంబంధించిన ఓ అప్ డేట్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. బిచ్చ‌గాడు 2కి సంబంధించి థీమ్ వీడియో రిలీజ్ చేశారు. విజ‌య్​ సెట్స్ లోకి వెళ్లడం.. బిచ్చ‌గాడిలా మేక‌ప్ చేసుకోవ‌డం వంటి అంశాలున్నాయి. ఈ విడీయోను రిలీజ్​ చేస్తూ బిచ్చగాడు 2 అధికారిక ప్రకటన వెలువరించారు.

దీంతో ఆ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగియాయి. ఇటీవల #Bikili Yoda Aethiri #AntiBikili తమిళ నినాదం అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ట్రెండింగ్‌లో ఉంది. యాంటీ బికిలీ మరెవరో కాదు.. విజయ్ ఆంటోనీ. ఈ సినిమాలో విల‌న్ పేరు ‘బికిలి’. విజయ్ ఆంటోని సరసన కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి విజయ్ మిల్టన్, ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై ఫాతిమా విజయ్ ఆంటోని బిచ్చగాడు 2 చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

https://youtu.be/SZ53jYM41do


లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement