Tuesday, April 23, 2024

నాగ‌చైత‌న్య, రాశీఖ‌న్నాల‌ థ్యాంక్యూ.. మ‌రో లిరిక‌ల్ సాంగ్ రిలీజ్ చేసిన మూవీటీమ్‌

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్న మూవీ థాంక్యూ. రాశి ఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా, అవికా గోర్‌, సుశాంత్‌ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా, ఈ సినిమా నుంచి ఫెర్వెల్ అనే త‌ర్డ్ సింగిల్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. రిలీజ్ అయిన ఈ లిరికల్ వీడియో చూస్తుంటే కాలేజ్ డేస్ లోని అందమైన జ్ఞాపకాలను.. స్నేహితులను గుర్తు చేస్తుంది.

ఈ సినిమాకి చంద్రబోస్ లిరిక్స్ రాయ‌గా.. థమన్ సంగీతంలో అర్మాన్ మాలిక్ ఈ పాటను పాడారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు థ్యాంక్యూ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 8న విడుదల కావాల్సి ఉండగా.. ఇప్పుడు జులై 22కి వాయిదా ప‌డిన‌ట్టు తెలిపింది మూవీ టీమ్‌

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement