Friday, March 29, 2024

బంగార్రాజు షూట్ స్టార్ట్

అక్కినేని నాగార్జున హీరోగా, కళ్యాణ కృష్ణ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయన. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇందులో నాగార్జున సరసన రమ్యకృష్ణ, అనుష్క, లావణ్య త్రిపాటి నటించారు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం బంగార్రాజు సినిమా తెరకెక్కబోతోంది. అయితే ఇందులో అక్కినేని నాగచైతన్య కూడా నటించబోతున్నారు.

గతంలో ఈ ఇద్దరు మనం సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. కాగా ఇందులో ఇద్దరి నటిస్తున్నారా. మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా నటిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయిందని తెలియజేస్తూ ట్వీట్ చేశారు అక్కినేని నాగార్జున.

Advertisement

తాజా వార్తలు

Advertisement