Wednesday, April 17, 2024

స‌మంత నా బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్ – నాగ‌చైత‌న్య‌

రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో హీరో నాగ‌చైత‌న్య ఇప్పుడు ఇదే స‌రైన నిర్ణ‌యం, స‌మంత‌, నేను విడిపోయాం. అయినా హ్యాపీగా ఉన్నామ‌ని చైతూ తెలిపాడు కాగా నాగ‌చైత‌న్య‌ని మీ బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్ ఎవ‌ర‌ని యాంక‌ర్ ప్ర‌శ్నించింది. దాంతో చైత‌న్య స‌మంత అని స‌మాధానం చెప్ప‌డం విశేషం. వీరిద్దరి కాంబో లో ఏమ్మయ చేసావే,మజిలీ, మనం సినిమాలు రాగా మంచి విజయం సాధించాయి. నాగార్జున నాగచైతన్య హీరోలుగా నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 విడుదలైంది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. ఈ సినిమాలో నాగ్ కు జోడిగా రమ్యకృష్ణ నటించగా చైతూ కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో చైతూ, నాగ్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ ఇంటర్వ్యూ లలో నాగచైతన్య, సమంత గురించి మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

\

Advertisement

తాజా వార్తలు

Advertisement