Saturday, May 8, 2021

రాజకీయాలకు దూరం…మళ్ళీ బండ్ల గణేష్ పై ట్రోల్స్

బండ్ల గణేష్… ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పనవసరం లేదు. నటుడిగా నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు బండ్లగణేష్. అలాగే రాజకీయాలలో కూడా అడుగుపెట్టారు. 2018లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్… కాంగ్రెస్ పార్టీలో చేరి ఇతర పార్టీ నాయకులపై ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే పీక కోసుకుంటా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత బ్లేడ్ గణేష్ గా పేరు తెచ్చుకున్నారు.

కొన్నాళ్ల తర్వాత రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లుగా అనౌన్స్ చేశారు. అయితే తాజాగా జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన మమతా బెనర్జీ కి బండ్లగణేష్ కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశాడు. కాగా ఇదే విషయమై ఓ నెటిజన్ బండ్ల గణేష్ ను ఓ ప్రశ్న వేశాడు. ఈ పార్టీలో చేరుతావా అంటూ అడిగాడు. అయితే నా జీవితంలో ఇక రాజకీయాలు అనేవి ఉండవు అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చాడు బండ్ల గణేష్.

Advertisement

తాజా వార్తలు

Prabha News