Wednesday, April 24, 2024

ఫస్ట్ ప్లేస్ బండ్ల గణేష్ కే… తరువాతే పవన్ కళ్యాణ్

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇంకో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వకీల్ సాబ్. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆదివారం శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ నిర్వహించింది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బండ్ల గణేష్, డైరెక్టర్ క్రిష్ ,హరీష్ శంకర్ వంటివారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి పవన్ సినిమా గురించి కొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు. అయితే ముఖ్యంగా అందులో బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు అభిమానులను నెటిజన్లను ఇట్టే ఆకట్టుకున్నాయి.

మామూలుగా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఆవేశంతో ఆగ్రహం కట్టలు తెంచుకుని మాట్లాడుతూ ఉంటాడు. ఈసారి కూడా అలానే తనదైనశైలిలో ఈశ్వర పవనేశ్వర పవరేశ్వర అంటూ ఇరగదీశాడు. ఇక ఆఖరి లో ఏడుకొండల వాడికి అన్నమయ్య, మహాశివుడికి భక్తకన్నప్ప, శ్రీ రాముడికి హనుమంతుడు, పవన్ కళ్యాణ్ కి బండ్లగణేష్ అంటూ మాట్లాడిన స్పీచ్ సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. ఎంత ట్రెండ్ గా మారిందంటే పవన్ కళ్యాణ్ స్పీచ్ రెండో స్థానంలో ఉండగా బండ్ల గణేష్ స్పీచ్ మొదటి స్థానంలో ఉంది. ఇదే విషయమై సోషల్ మీడియాలో ఇప్పుడు మీమ్స్ ప్రత్యక్షమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement